NandyalAbdul Javid

గోశాలకు దాన ప్యాకెట్లకు వితరణ

గోశాలకు దాన ప్యాకెట్లకు వితరణ

నంద్యాల (పల్లెవెలుగు) 26 ఫెబ్రవరి: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల SBI కాలనీ మరియు మహానందిలో బసవరాజు ఏర్పాటుచేసిన బృందావన గోశాలకు “నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామ వాస్తవ్యులు అయిన కృష్ణమూర్తి, శేషవల్లి దంపతుల కుమారుడు షణ్ముఖ వీరి సహకారంతో రెండు 50 కేజీల మార్కుఫెడ్ దాన ప్యాకెట్లను బృందావన గోశాలకు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా గోశాలకు దాన ప్యాకెట్లకు సహకరించిన దాతలకు మదర్ యూత్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి , సభ్యుడు హుస్సేన్ వలి  పాల్గొన్నారు.

Back to top button