NandyalAbdul Javid

ప్రింటర్స్ డే పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం

ప్రింటర్స్ డే పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం

నంద్యాల టౌన్, ఫిబ్రవరి 24 : ప్రింటర్స్ డే పురస్కరించుకొని గురువారం యస్ఆర్ బిసి రోడ్డులోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు నంద్యాల ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు రమేష్, బషీర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ మాబున్నిసా పిల్లలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ మానవ అభివృద్ధిలో ప్రింటింగ్ అనేది ఎంతగానో తోడ్పడిందన్నారు. అటువంటి రోజున సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో హిద్రీస్, ధర్మతేజ, శేఖర్, హర్షద్, హిదయాత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button