NandyalAbdul Javid

చంద్రబాబు సమక్షంలో జియం గౌస్ టీడిపిలో చేరిక

చంద్రబాబు సమక్షంలో జియం గౌస్ టీడిపిలో చేరిక

నంద్యాల (పల్లెవెలుగు) ఫిబ్రవరి24:  పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త జియం గౌస్ గురువారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు ముస్తాక్ మౌలానా వెంట చంద్రబాబును కలిశారు. అనంతరం నంద్యాలలో రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు జియం గౌస్ ను టీడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జియం గౌస్ మాట్లాడుతూ వైసీపి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. గత 3 దశాబ్దాలకు పైగా తమ కుటుంబానికి టీడిపితో అనుబంధం ఉందని గుర్తు చెసుకున్నారు. జిల్లాలో టీడిపి గెలుపుకు తమ శాయ శక్తుల కృషి చేస్తామన్నారు. ఆయన వెంట టిడిపి నాయకులు అబ్దుల్ రషీద్,  తదితరులు  పాల్గోన్నారు.

Back to top button