Nandyal

ప్రత్యెక హోదా కోసం టిడిపి దీక్ష

రివర్స్ టెండరింగ్ తో రివర్స్ వెళ్తున్న రాష్ట్రం  – ఎమ్మెల్సి ఫరూక్

నంద్యాల (పల్లెవెలుగు) 21 ఫెబ్రవరి:  ప్రత్యెక హోదా కోసం టిడిపి ముస్లిం మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమద్ సోమవారం ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఎమ్మెల్సి టిడిపి నాయకుడు ఫరూక్ దీక్ష ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వత్తడికి తలొగ్గి ప్రత్యెక హోదాను తాకట్టి పెట్టరన్నారు.  టిడిపి హయంలో చేసిన అభివృద్ధి పనులన్నింటిని రివర్స్ టెండరింగ్ పెరట రాష్ట్రాన్ని వెనక్కి తీసుకొని వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి నాయకులపై వైసిపి ప్రభుత్వ దౌర్జన్యాలు ఎక్కువైయ్యాయని వాటికి భయపడేది లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ముస్లిం మైనోరిటిల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను  ప్రవేశ పెట్టగా వాటిని ప్రస్తుత వైసిపి ప్రభుత్మం నిలిపి వేసి మైనరిటిలను అన్యాయం చేస్తుందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమానికి నిరసిస్తూ టిడిపి హయంలో కార్యక్రమాలను మొదలిపెట్టమని కార్యకర్తలు అందరు కదలి  రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో టిడిపి అధ్యక్షుడు మనియార్ ఖలీల్ అహ్మద్, అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి జి.ఎం. గౌస్, కాంగ్రెస్ సేవదాల్ మస్తాన్ ఖాన్, కాంగ్రెస్ పార్టి పిసిసి అధికార ప్రతినిధి వాసు,  మరియు  మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యెక హోదా కోసం టిడిపి దీక్ష

  • రివర్స్ టెండరింగ్ తో రివర్స్ వెళ్తున్న రాష్ట్రం  – ఎమ్మెల్సి ఫరూక్

Back to top button