NandyalAbdul Javid

ఎంఎల్ఏ నిరాడంబరత ను ప్రశంసించిన ముస్లిం నాయకులు

ఎంఎల్ఏ నిరాడంబరత ను ప్రశంసించిన ముస్లిం నాయకులు

నంద్యాల (పల్లెవెలుగు) 21 ఫెబ్రవరి: నంద్యాల ఎంఎల్ఏ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డీ నిరాడంబరతను ముస్లిం పెద్దలు జమాఆతె ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ సమద్, జేఎసి అధ్యక్షులు ముహమ్మద్ అబులైస్ , నాయకులు యస్.ఎండి.యూనూస్ ప్రశంసించారు. విషయంలోకి వస్తే ఈ రోజు ఉదయం జమాత్ కు సంబంధించిన వైయస్ నగర్ స్థల విషయంలోను, పొన్నాపురంలోని టీచర్లు స్థలం పరంగా ఉన్న సమస్యలు ఎంఎల్ఏతో చర్చించుటకు ముస్లిం నాయకులు వచ్చి ఆయన జిమ్ నుంచి వచ్చేవరకు టీ త్రాగుతు కూర్చున్నారు. అయితె జిమ్ నుంచి వచ్చిన ఎంఎల్ఏ శిల్పా రవి నేరుగా ముస్లిం నాయకులు వద్దకు వచ్చి వాళ్ళతో అదే బెంచి పై కూర్చొని టీ తాగుతు విషయాలు అన్ని చర్చించి పరిష్కారానికి పూనుకున్నారు. అనంతరం అబులైస్, సమద్ మాట్లాడుతూ రాజకీయనాయకులు యువకులు కావడం నిరాడంబరంగా ఉండటం శుభపరిణామం అని, శాసన సభ్యులు సామాన్యుడిగా తమతో రోడ్డుపై టీ తాగుతు మమైకం అయిన తీరు ప్రశంసనీయమని, ఎంఎల్ఏ తీరును అభినందించారు.

Back to top button