NandyalAbdul Javid

విజ్ఞాన సూచికకు అంతర్జాతీయ గుర్తింపు

విజ్ఞాన సూచికకు అంతర్జాతీయ గుర్తింపు

నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ ఎం. జైనుల్లావుద్దీన్ గత ఎనిమిది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న విజ్ఞాన సూచిక మాస పత్రికకు అంతర్జాతీయ  ఖ్యాతి దక్కినది. ఈ సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో విజ్ఞానసూచిక ఫిబ్రవరి సంచికను ఆవిష్కరించిన అనంతరం చైర్మన్ పి. దస్తగిరి రెడ్డి  ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ అనుమతిలో గత ఎనిమిది సంవత్సరాల నుండి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా డాక్టర్ ఎం జైనుల్లావుద్దీన్  చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తూ  నిర్వహిస్తున్న విజ్ఞాన సూచిక మాసపత్రికకు పారిస్  ప్రధాన కేంద్రం వున్న ఐఎస్ఎస్ఎన్ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్  సీరియల్ నంబర్) వారు భారత ప్రభుత్వము ద్వార అన్ని రకాల పరిశీనల అనంతరం 2583- 1046 అనే నంబర్ను కేటాయించారని, కర్నూలు జిల్లాలో కేవలం ఐదు పత్రికలకు మాత్రమే అంతర్జాతీయ గుర్తింపు ఉందని  అందులో విజ్ఞాన సూచిక ఒకటని అన్నారు. ఈ గుర్తింపు ద్వార డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, ఆచార్యులు సంపాదకీయాలు ప్రచూరించ వచ్చని  భవిష్యత్లో ఈ మాస పత్రిక మరింత అభివృద్ధి సాధించాలని అన్నారు. ఈ కార్య క్రమంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్  పి. మౌలాలి రెడ్డి, శ్రీ గురు రాజా ఇంగ్లీష్  మీడియం స్కూలు డైరెక్టర్  పి. షావల్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, జాకీర్ వీరయ్య, రామలింగం, దీపిక, బేగం, పి.ఇ.టి. రాజశేఖర్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Back to top button