Nandyal

AISF ఆధ్వర్యంలో ఘనంగా మోడల్ టెస్ట్ ప్రారంభం

AISF ఆధ్వర్యంలో ఘనంగా మోడల్ టెస్ట్ ప్రారంభం

  • AISF జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు
  • 10 th పబ్లిక్ పరిక్షలంటే అధైర్య పడవద్దు
  • విద్యార్థులకు నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్
  • విద్యార్థులు తమ జీవితాలు మెరుగుపరచుకోవడానికి మంచి ఉత్తీర్ణత సాధించాలి
  • విద్యార్థులకు సూచించిన శాంతినికేతన్ విద్యాసంస్థల అధినేత సుధాకర్
  • పరీక్షలంటే భయం వద్దు-విద్యార్థుల భవిష్యత్ ముద్దు
  • విద్యార్థులకు తెలియజేసిన AIYF రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు

నంద్యాల (పల్లెవెలుగు) 16 ఫెబ్రవరి: AISF ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ టెస్ట్ ప్రారంభంలో విద్యార్థులకు పిలుపునిచ్చిన AIYF రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, MEO బ్రహ్మం నాయక్, శాంతి నికేతన్ విద్యాసంస్థల అధినేత సుధాకర్

AISF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ టెస్ట్ లో క్వశ్చన్ పేపర్ ఆవిష్కరించిన మండల MEO బ్రహ్మం నాయక్, శాంతి నికేతన్ స్కూల్స్ కరస్పాండెంట్ సుధాకర్  ముఖ్య అతిధులుగా నంద్యాల MEO బ్రహ్మం నాయక్, శాంతి నికేతన్ స్కూల్స్ కరస్పాండెంట్ సుధాకర్, AIYF రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా విజృంభించిన నేపథ్యంలో ప్రభుత్వమే విద్యార్థులను డైరెక్ట్ గా పాస్ చేయడం జరిగింది. ఎటువంటి పరీక్షలు లేకుండా పాస్ చేయడం వల్ల విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన లేకపోవడం, పరీక్షలంటే భయాందోళన చెందడం అనేటువంటి అంశాలను విద్యార్థుల్లో నుంచి తొలగించి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం కోసమే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్న మోడల్ టెస్ట్ లో నంద్యాల పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్థులు దాదాపుగా పాల్గొంటున్నారని, ఈ మోడల్ టెస్ట్ పరీక్ష ను స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి క్రాంతి నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ నందు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ఈ పరీక్ష ప్రారంభంలో  ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహాంనాయక్, శాంతినికేతన్ విద్యా సంస్థల అధినేత సుధాకర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాముడు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు నిరంతరం కృషి చేసే ఇటువంటి విద్యాసంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి పరీక్షలకు భయపడకుండా వారి ఉజ్వల భవిష్యత్తు కోసం నడుం బిగించాలని అంతేకాకుండా ఈ పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్ధుల్లో భయం పోయి పరీక్షలంటే ఇష్టం గా ఉండే విధంగా చేయడం కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు విద్య పైన అవగాహన కలిగి ఉండి తమ భవిష్యత్తు కోసం ముందుకు రావాలని విద్యార్థులు తాము చదువుకుంటున్న విద్యా సంస్థలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఉత్తీర్ణత సాధించాలని వారు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎర్రిస్వామి, AISF నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, AIYF నంద్యాల పట్టణ కార్యదర్శి విష్ణు, నాయకులు ప్రవీణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు

Back to top button