Nandyal

ప్రత్యేకహోదాపై మళ్లీ జగన్నాటకం సీఎం తక్షణమే రాజీనామా చేయాలి – తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్

ప్రత్యేకహోదాపై మళ్లీ జగన్నాటకం సీఎం తక్షణమే రాజీనామా చేయాలి – తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ డిమాండ్

నంద్యాల (పల్లెవెలుగు) 15 ఫెబ్రవరి:  కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక హోదా తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని , ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మోడి దగ్గర మోకరిల్లారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆరోపించారు. మంగళవారం వారం నంద్యాల పట్టణంలో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సందర్భంగా ఉత్పన్నమైన ఉమ్మడి సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక చర్యలకు త్రిసభ్య కమిటీని నియమించి కొన్ని అంశాలను పొందుపరిచిందని, అందులో ప్రత్యేక హోదా ఉందని వైఎస్ జగన్ పార్టీ ఎనలేని అత్యుత్సాహాన్ని ప్రదర్శించిందని అయితే తీరా ప్రత్యేకహోదా కేంద్రం పక్కన పెట్టిందనేసరికి జగన్ మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారన్నారు. చంద్రబాబునాయుడే ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టించారనే తప్పుడు ప్రచారానికి వైసీపీ దిగిందని, ఇది సిగ్గుచేటని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి  పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేకుంటే నైతికత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు

Back to top button