Nandyal

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర మహా సభకు సంబంధించిన కర పత్రాన్ని  ఆవిష్కరణ

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర మహా సభకు సంబంధించిన కర పత్రాన్ని  ఆవిష్కరణ

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర మహా సభకు సంబంధించిన కర పత్రాన్ని నంద్యాల లోని జిల్లా కార్యాలయం నందు నేడు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ రెడ్డి హాజరు కావడం జరిగినది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు ఆకుమళ్లా రహీమ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర స్థాయి మహా సభలు గుంటూరు లోని AC కళాశాల ఆవరణలో, పబ్రవరి నెల 26,27 వ తేదీలలో నిర్వహించ బోతున్నమని ఈ మహాసభకు రాష్ట్రం లోని 13 జిల్లాల నుండి మా కార్యకర్తలు హాజరు అవుతారని, అందులో భాగంగానే కర్నూల్ జిల్లా నుండి ఎక్కువ సంఖ్య  లో సభ్యులు హాజరు కావాలని కోరడం జరిగింది. కర్నూలు నగర అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ముఖ్య ఉద్దేశం ఏమనగా  ప్రజలను , ప్రజాస్వామ్యం పట్ల , భారత రాజ్యాంగం గురించి, చట్టాల గురించి గ్రామ సభలు మరియు వార్డు సభలు గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ,శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కావున ప్రతి పౌరుడు మా సంస్థ లో చేరి అవగాహన పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు అకుమాల్లా రహీమ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణ రెడ్డి కర్నూల్ నగర అధ్యక్షులు రవి కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామ్, నంద్యాల కోశాధికారి డీపీ మస్తాన్ వలీ, పట్టణ ఉపాధ్యక్షులు నబి రసూల్, సభ్యులు సత్యనారాయణ, శివశంకర్, పాములాపాడు మండల కన్వీనర్ చిన్న నాగన్న , మహానంది మండలం కన్వీనర్ వెంకటేశ్వర్లు ,నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి ముల్లా ఆరిఫుద్దిన్, వాహిధ, అబ్దుల్ మజీద్ తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button