NandyalAbdul Javid

జగనన్న చేదోడు పథకంలో రజకులకు తీవ్ర అన్యాయం

జగనన్న చేదోడు పథకంలో రజకులకు తీవ్ర అన్యాయం

నంద్యాల ( పల్లెవెలుగు) 12 ఫెబ్రవరి:  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన జగనన్న చేదోడు పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు తీవ్ర అన్యాయం జరిగిందని  ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో పాత్రికేయుల సమావేశాన్ని నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మద్దూరు వెంకట రమణ రజక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు రజక మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  “జగనన్న చేదోడు” పథకాన్ని రజకులకు మొక్కుబడిగా పంపిణీ చేశారని,ముఖ్యమంత్రి జగనన్న, రజకులను, నాయి బ్రాహ్మనులను, టైలర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.ప్రస్తుత పాలకులు ఎన్నికల సమయంలో కేవలం ఓటు బ్యాంకు కోసం బీసీల జపం చేసి,అధికారంలోకి వచ్చాక  పూర్తిగా విస్మరించారని, బీసీలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న చేదోడు పథకంలో రజకులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో రజకులు 25 ఉన్నప్పటికీ, 13 జిల్లాల్లో ఎక్కడ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటును కేటాయించకపోవడంలో వైసీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికైనా రజకులు  రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించి, రజక ఎస్సీ జాబితా ను సాధించుకోవడం కోసం ఇంటికొక సైనికుడిగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని మనవి చేస్తున్నామన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజకజాతి పూర్తిగా అనగారిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో రజక ఎస్సీ సాధన చైతన్య సమితి నాయకులు కౌలురు రజక శ్రీనివాసులు, కైరుప్పల ప్రసాద్, శీలం రమణ, చంద్రగిరి మహేష్ , మద్దిలేటి, దేవనగర్ శ్రీనివాసులు, శేషు, నాగరాజు, నందవరం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button