NandyalAbdul Javid

ఆంధ్ర రాష్టంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చైయ్యాలి

ఆంధ్ర రాష్టంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చైయ్యాలి

నంద్యాల (పల్లెవెలుగు) 06 ఫెబ్రవరి: రైతు నగర్ నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు సోమవారం ఉదయం 12:30 గంటలకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి నంద్యాలకు వస్తున్నార ని నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు జె.లక్ష్మి నరసింహ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు వ్యవహారిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ అలాగే దేశం లో ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్టల లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అదేసుర్తితో ఆంధ్ర రాష్టంలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చైయ్యాటని యాత్రలో భాగంగా నంద్యాలకు వస్తున్న స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి దిశా నిర్దేశం చేస్తారు, కావున కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గ నాయకులు, టౌన్ మరియు మండల అధ్యక్షులు, కార్యకర్తలు ,అభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని వారు కోరారు. అనంతరం నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు SMD ఫారూక్ ఆహ్వానం మేరకు SMD ఫారూక్ బావమరిది పెళ్లి కి విచ్చేసి వధువరులను ఆశీర్వదించి అననంతరం తన స్వాగ్రామానికి భావాలుదేరుతన్నారు.

Back to top button