NandyalAbdul Javid

కేంద్ర బడ్జెట్ పేదల నడ్డి విరిచేలా అప్పుల బడ్జెట్ లా ఉంది. MPJ

కేంద్ర బడ్జెట్ పేదల నడ్డి విరిచేలా అప్పుల బడ్జెట్ లా ఉంది. MPJ

నంద్యాల (పల్లెవెలుగు) 04 ఫెబ్రవరి: స్థానిక పట్టణం లోని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నంద్యాల పట్టణ అధ్యక్షులు అబూబకర్ సిద్ధిఖ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల ప్రమాణాలను దిగజార్చేవిధంగా ఉందని, 67 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 40 లక్షల వేలకోట్లు అప్పు చేస్తే, కేవలం ఏడు సంవత్సరాల కాలంలో బీజేపీ పాలనలో 75 లక్షల వేలకోట్లు అప్పు చేసి దేశం అప్పల్లో కూరుకుపోయేలా చేసింది. దేశం ప్రగతి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళకుండా అప్పుల వైపు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డపై లక్ష రూపాయల అప్పుభారం మోపుతున్నారని అన్నారు.  పారిశ్రామిక వేత్తలకు వత్తాసు పలుకుతూ పేద ప్రజల నెత్తురు తాగుతున్నట్లుగా ఈ బడ్జెట్ తయారు చేశారని, ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే పేదలను మరింత పేదలుగా మారతారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా మొండి చెయ్యి చూపడం చాలా దుర్మార్గం. కర్నూలు జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వలేదని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు లేవని, వెనుకబడిన రాయలసీమకు  మంత్రాలయం నుండి కర్నూలు రైల్వే లైన్ ఊసేలేదని, కేంద్ర ప్రభుత్వానికి కావలసిన అన్ని బిల్లులకు మద్దతు పలికిన అధికార,ప్రతిపక్ష పార్టీలు నిధులు రాబట్టడంలో విఫలం అయ్యాయని, జిల్లా ఎంపీలు నోరు మెదకపోవడంపై ఆశ్చర్యం గా ఉందన్నారు. ఈ తప్పుడు బడ్జెట్ను ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని రాబోవు రోజుల్లో భారతీయ జనతా పార్టీకి చమరగీతంపాడి గద్దె  దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టీస్ పట్టణ అధ్యక్షుడు అబూబకర్ సిద్ధిఖ్, ఫజులే హాఖ్, మహబూబ్ బాషా తదితరులు  పాల్గొన్నారు.

Back to top button