NandyalAbdul Javid

కేవలం పెత్తందార్ల కోసం తయారైన కేంద్ర బడ్జెట్ – మైనార్టీల పై వివక్ష తేటతెల్లం – జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు సమద్

కేవలం పెత్తందార్ల కోసం తయారైన కేంద్ర బడ్జెట్ – మైనార్టీల పై వివక్ష తేటతెల్లం – జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 2 ఫెబ్రవరి: పార్లమెంట్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశం పెట్టిన ఇ-బడ్జెట్ ఊహించిన దాని కన్నా అధ్వాన్నంగా దేశంలో పేదలను విస్మరించి కేవలం కార్పోరేట్ల కోసమే తయారు చేసినట్లు ఉందని, మైనార్టీల పై వివక్ష కొట్టొచ్చినట్లు ఉందని కేటాయింపులపై జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ తీవ్ర నిరసన తెలిపారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 5,020.50 కోట్లు కేటాయించబడింది. ఇది మొత్తం బడ్జట్లో 0.23% శాతమేనని ఆయన ఆక్షేపించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం సవరించిన గణాంకాల కంటే రూ.674.05 కోట్లు ఎక్కువ అయిన, గత సంవత్సరం కన్నా కేవలం 4% పెంచారని 2021-22 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బడ్జెట్ అంచనా 4810.77 కోట్లు మరియు తరువాత సవరించిన కేటాయింపు 4346.45 కోట్లుగా ఉంది. గత కేటాయింపులు పలు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో వినియోగించిన దాఖలాలు లేవని సమద్ కేటాయింపులపై పెదవి విరిచారు. మంత్రిత్వ శాఖకు ప్రతిపాదిత కేటాయింపులలో, 1425 కోట్లు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం మరియు 515 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి కార్యక్రమాల కోసం 491 కోట్లకు పైగా కేటాయించబడింది. ముస్లిం తదితర మైనార్టీల సంక్షేమం పై ఎలాంటి అభివృద్ధి సూచనలు లేవు. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 2022-23 బడ్జెట్‌ను ప్రశంసించటం గమనార్హం. ఈ కేటాయింపులపై గుజరాత్‌కు చెందిన హక్కుల సంఘం మైనారిటీ కోఆర్డినేషన్ కమిటి ఇది కేంద్ర ప్రభుత్వం మైనారిటీల వెనుకబాటు తనాన్ని తొలగిoచేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు అని పేర్కొంది. దేశ జనాభాలో మైనార్టీలు 19.3% ఉన్నారని, కనీసం లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేధావులు డిమాండ్ చేశారని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన పథకాల బడ్జెట్‌ను తగ్గించిందని, మైనార్టీల ప్రత్యేక కార్యక్రమం బడ్జెట్‌లో రూ.8.58 కోట్లు తగ్గింపు, క్వామీ వక్ఫ్ బోర్డు ప్రోగ్రెసివ్ స్కీమ్ బడ్జెట్‌లో రూ.1 కోటి తగ్గింపు, నయీ మంజిల్ పథకంలో తగ్గింపు రూ.41 కోట్లు మరియు మైనారిటీ మహిళల నాయకత్వ అభివృద్ధిలో రూ.5.50 తగ్గింపు  ఉందని సమద్ ఆవేదన వెలిబుచ్చారు.మౌలానా ఆజాద్ ఫౌండేషన్ బడ్జెట్ వాస్తవంగా రద్దు చేయబడిందని, దానికి కేవలం రూ. 1 లక్ష మాత్రమే కేటాయించారని, మైనారిటీలు మరియు మదర్సాల విద్యా పథకంలో రూ.14 కోట్ల తగ్గింపు ఉందని, సామాజిక భద్రతకు కోట్ల కొరత రూ.41.67 ఉందని, ప్రభుత్వం ప్రత్యెక దృష్టి సారిస్తున్న నైపుణ్యాభివృద్ధిలో రూ. 41 కోట్ల తగ్గింపు ఉందని అన్నారు. విద్యా రుణాల వడ్డీ రాయితీ పథకం, పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ స్కీమ్, యుపిఎస్‌సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పథకం, మైనారిటీల కోసం ప్రత్యేక కార్యక్రమం కింద పరిశోధన, వారసత్వం సంస్కృతిని కాపాడే పథకంలో పెరుగుదల లేదు.ఇది ప్రభుత్వం మైనారిటీ సమాజంపై వివక్షకు మరియు భారతదేశంలోని మైనారిటీలు అభివృద్ధి పథంలో ఎదగాలని కోరుకోవడం లేదని ఈ కేటాయింపులు స్పష్టం చేస్తున్నట్టు సమద్ వాపోయారు.

Back to top button