NandyalAbdul Javid

రైతాంగాన్ని నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్వ్యవసాయ రంగానికి మొండిచెయ్యి

రైతాంగాన్ని నిరాశ పరిచిన కేంద్ర బడ్జెట్వ్యవసాయ రంగానికి మొండిచెయ్యి

నంద్యాల (పల్లెవెలుగు) 02 ఫెబ్రవరి: పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని నిరాశ పరిచిందని జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా దళిత గిరిజన జిల్లా అధ్యక్షుడు సోమవరపు మధు బాబు తీవ్రంగా విమర్శించారు. కేంద్ర బడ్జెట్- వ్యవసాయ రంగానికి కేటాయింపులు  అంశంపై స్థానిక ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూశారని చెప్పారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు రైతులు వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా ఉన్నాయన్నారు.  మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకువచ్చి అన్ని పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతుధరలు పెంచాలని రైతులు కోరుతున్నా అటువంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్ లో లేవన్నారు. యాంత్రీకరణకు ప్రోత్సాహం, జీరో బడ్జెట్ ఫార్మింగ్, వంటనూనెలలో ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, 2023 తృణధాన్యాల సంవత్సరం అని గొప్పగా మాటలు చెప్పి అందుకు తగిన నిధులు కేటాయింపు, ఆచరణలో అమలు వంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో కనిపించలేదని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధంగా బడ్జెట్ ఉందన్నారు. కౌలు రైతుల సంక్షేమాన్ని విస్మరించారని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళు సందర్భంగా పంటలు నష్టపోయిన సందర్భాల్లో ఇచ్చే పంటల బీమా పథకం, ఇన్ ఫుట్స్ సబ్సిడీల గురించి ప్రస్తావన లేదన్నారు. నదుల అనుసంధానం గురించి గొప్పగా చెప్పి పోలవరం ప్రాజెక్టు నిధుల నిధులు కేటాయింపు పై నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు. రోజు రోజుకి పెంచి వేస్తున్న ఎరువుల ధరలు తగ్గింపు, సబ్సిడీల ప్రస్తావన లేకపోవడం అన్యాయమన్నారు. వంటనూనెలు సమృద్ధి సాధించాలంటే ఆయిల్ పామ్, వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రోత్సహించాలని, సబ్సిడీ పథకాలు అమలు చేయాలన్నారు. రైతాంగానికి పంట రుణాలు ఇచ్చే విధంగా మరిన్ని చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విడుదల చేసిన బడ్జెట్ లో పేద మధ్యతరగతి వర్గాలకు వేతన జీవులకు కష్టజీవులకు నిరాశ మిగిలింది అని అన్నారుమన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు పోలవరానికి నిధులు ఇస్తామన్నారు కానీ ఈ బడ్జెట్లో  మనకు ఇచ్చిన హామీలు గురించి ఏ మాత్రం కూడా ప్రస్తావన తీసుకురాలేదుకనుక ఈ బడ్జెట్ మన రాష్ట్రానికి గాని పేద ప్రజలకు  వెనుకబడిన మధ్యతరగతి వర్గానికి గాని ఉపయోగకరంగా లేదని అన్నారు

Back to top button