NandyalAbdul Javid

బండి ఆత్మకూరు మండలంని నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఉంచాలి

బండి ఆత్మకూరు మండలంని నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఉంచాలి

నంద్యాల (పల్లెవెలుగు) 01 ఫెబ్రవరి: బండి ఆత్మకూరు మండలంని నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఉంచాలని పాణ్యం గడివేముల మండలములు నంద్యాల రెవెన్యూ డివిజనల్ ఉంచాలని APCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు. కొత్త జిల్లాల ఏర్పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు లో భాగంగా బండి ఆత్మకూరు మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ పాణ్యం, గడివేముల మండలాలను కూడా నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని ఉంచాలని ఈ రోజు కలెక్టర్ వారి కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. నంద్యాలకు దగ్గరలో ఉన్న బండి ఆత్మకూరు మండలం ఆత్మకూరు డివిజన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తూ పది కిలోమీటర్ల దగ్గర్లో ఉన్న నంద్యాల డివిజన్ కాకుండా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో లో కలపడంతో మండలం లోని ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజల సౌకర్యార్థం డిమాండ్ చేస్తున్నాంఅన్నారు. గడివేముల మండలాలు కూడా నంద్యాల కు దగ్గరగా ఉన్నందున నంద్యాల రెవెన్యూ డివిజన్ లోనే ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని కోరడం అయింది. ఈ కార్యక్రమలో మైనార్టీ నాయకులు GM. గౌస్, వక్ఫ్ ప్రొటెక్షన్ ఫారం రాష్ట్ర కో-కన్వినర్ జవిద్, అత్తర్ మాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Back to top button