Nandyal

నంద్యాల ను జిల్లాగా ప్రకటించినందుకు  MLA శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన న మహిళలు

నంద్యాల ను జిల్లాగా ప్రకటించినందుకు  MLA శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన న మహిళలు

నంద్యాల (పల్లెవెలుగు) 28 జనవరి: పట్టణంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాస్ సెంటర్ వరకు భారీ ఎత్తున మహిళలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా  నంద్యాలను జిల్లాగా చూడాలన్న ప్రజల ఆశయాన్ని నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మా భున్నిసా మాట్లాడుతూ నంద్యాలను జిల్లా గా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకు మరియు మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే  శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసం నుండి  శ్రీనివాస్ సెంటర్ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు మహిళలందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన జగనన్నకు  ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న మన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ముఖ్యంగా మహిళల పక్షపాతిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వారి కోసం ప్రత్యేక పథకాలను ఏర్పాటుచేసి వారు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మున్సిపల్ మహిళా కౌన్సిలర్ మరియు కో ఆప్షన్ సభ్యులు, మహిళా సంఘాలు వైయస్సార్సీపి మహిళలు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks