NandyalAbdul Javid

రజకులకు రక్షణచట్టాన్ని అమలు చేయాలి

రజకులకు రక్షణచట్టాన్ని అమలు చేయాలి

రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు రజక డిమాండ్.

నంద్యాల (పల్లెవెలుగు) 27 జనవరి: రాష్ట్రంలో రజకులపై  దాడులు,కులంపేరుతో దూషణలు,గ్రామబహిష్కరణలు జరుగుతుండడంవల్ల రజకులకు రక్షణచట్టాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని రజక ఎస్సీ సాధన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి కేసి సంజీవరాయుడు ఆధ్వర్యంలోఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు  నందవరం శ్రీనివాసులు రజక పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో రజకుల అభివృద్ధి పై ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.రజకుల పై దాడులు, కులం పేరుతో దూషణలు,గ్రామబహిష్కరణలు జరుగుతున్న కళ్లులేని కాబోదుల్లా చూస్తుండడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలు కేవలము ఎన్నికల సమయంలో రజకులపై ఎంతో ప్రేమ,అభిమానం పేరుతో సవతితల్లి ప్రేమను చూపిస్తూ,అధికారంలోకి వచ్చిన తరువాత రజకుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని తెలిపారు. రజకుల పై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి వున్నా రజక కార్పొరేషన్ కు రు.2వేల కోట్లు నిధులు కేటాయించడమే కాకుండా,నిరుపేద రజకులకు ఉచితంగా 3 సెంట్ల ఇంటిస్థలాన్ని కేటాయించి,గృహాలను నిర్మించి,రజక కాలనీలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 50 సంవత్సరాలు ఉన్న రజకులు సామజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయాలని అన్నారు. ప్రస్తుతం సమాజంలో  రజకుల పై జరుగుతున్న దాడులు, బహిష్కరణలు,కులం పేరుతో దూషణలు జరగకుండా,రాష్ట్ర ప్రభుత్వం రజకులకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీయాక్టు మాదిరిగా రక్షణచట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక ఎస్సీ సాధన చైతన్య సమితి నాయకులు రాష్ట్ర నాయకులు శీలం శ్రీనివాసులు రజక, పార్లమెంటు జిల్లా నాయకులు విజయ్ కుమార్ రజక  కైరుప్పల మహేష్, చిన్న సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Back to top button