NandyalAbdul Javid

జాతీయ పండుగలు యువతలో దేశభక్తి, రాజ్యాంగ లౌకిక స్ఫూర్తి నింపాలి – జమాఆతె ఇస్లామీ సమద్

జాతీయ పండుగలు యువతలో దేశభక్తి, రాజ్యాంగ లౌకిక స్ఫూర్తి నింపాలి – జమాఆతె ఇస్లామీ సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 26 జనవరి: జాతీయ పండుగలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం దేశ ప్రజలలో మరి ముఖ్యంగా యువతలో దేశభక్తి, రాజ్యాంగ లౌకిక స్ఫూర్తి నింపే విధంగా నిర్వహించాలని జమాఆతె ఇస్లామీ హింద్, నంద్యాల శాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ అభిలషించారు. ఎస్బిఐ కాలనీ, మస్జిద్-ఎ-రసూల్ ప్రాంగణంలో నిర్వహించిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సమద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఇమామ్ హాఫీజ్ ముహమ్మద్ సలీం పర్వేజ్ అధ్యక్షతన జరిగిన జెండా వందన సమావేశంలో అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఈ త్రివర్ణ పతాకం ఛాయలో ప్రతి భారతీయుడు గర్వంగా సేద తీరాలని, జాతీయ పతాక ఔన్నత్యం కాపాడుటం కోసం ఎందరో మహానుభావులు తమ మాన, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసారని, స్వాతంత్ర్య సముపార్జన కోసం అందరు మతాలకు అతీతంగా పోరాటం చేసారన్నారు. అయితే తస్మాత్ జాగ్రత్తా! కొని ఫాసి‌స్టు శక్తులు రాజకీయ మనుగడకోసం మతాలమధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు అని ఆవేదన వెలిబుచ్చిన యువత వారసత్వంగా జాతీయ పండుగలు నిర్వహించాలన్నారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ సలీం, షక్శాబాషా,ఖాజా, అర్షాద్ హఖ్, అబ్దుల్ హకీమ్, ముహమ్మద్ అస్లం, గౌస్ మొహియుద్దీన్, జబ్బార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button