NandyalAbdul Javid

దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(DDU-GKY Center ) శిక్షణ కేంద్రం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు

దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(DDU-GKY Center ) శిక్షణ కేంద్రం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నంద్యాల కొత్తపల్లె రోడ్డులో ఉన్నటువంటి దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రాeమీణ కౌశల్య యోజన(DDU-GKY Center ) శిక్షణ కేంద్రం నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి, సభ్యుడు హుస్సేన్ వలి, న్యూ బాడీ లైన్ & ఫిట్ నెస్ జిమ్ సెంటర్ కోచ్ షేక్ ఖాజా మొహిదీన్ పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి తాడి రామకృష్ణారెడ్డి మరియు అధ్యాపకులు, స్టూడెంట్స్ పాల్గొనడం జరిగినది. 73వ గణతంత్ర వేడుకల సందర్భంగా మదర్ యూత్  అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అనంతరం విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులకు మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి చేతుల మీదుగా మెమెంటోలు అందించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి. మురళి మాట్లాడుతూ ఈ గణతంత్ర దినోత్సవం రోజున విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి, శిక్షణ ఇస్తున్న DDU-GKY సెలబ్రన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి గ్రామీణ మరియు పట్టణ నిరుద్యోగ యువత శిక్షణ ఇచ్చి హాస్టల్ వసతి కల్పించి ప్లేసెమెంట్ ను కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి నిరుద్యోగ యువకులు మరియు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.

Back to top button