NandyalAbdul Javid

కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

 నంద్యాల (పల్లెవెలుగు) 26 జనవరి: కాంగ్రెస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  నంద్యాల కాంగ్రెస్ కార్యాలయంలో దాసరి చింతలయ్య మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి, జండా వందనం చేసిన తర్వాత,  రిపబ్లిక్ డే గురించి ఈ విధంగా వివరించారు. మన భారతదేశానికి 1947 లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 26/01/1950 నుండి దేశంలో రాజ్యాంగం అమలైంది. దీని ప్రకారం భారతదేశం ప్రజాస్వామ్యంగా, సర్వసత్తాక దేశంగా, గణతంత్ర దేశంగా సంపూర్ణ రాజ్యాంగం సిద్ధించిందన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసిన, స్వతంత్ర  యుద్ధంలో సమర్ధులైన గొప్ప వ్యక్తుల గురించి తెలియజేసారూ. ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య, జిల్లా సెక్రెటరీ రహిమాన్, సీనియర్ నాయకులు మహమ్మద్, ఫరూక్, నంద్యాల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శివరామిరెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు బి శివారెడ్డి, ఎస్ వై డి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్లా, రియాజ్ బాష, సత్యం, ఆనంద్, రాజు, హుస్సేన్ రెడ్డి, జాకీర్, రత్నమయ్య సుబ్బయ్య మొదలగు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Back to top button