NandyalAbdul Javid

ఘనంగా గణతంత్ర దినోత్సవం

ఘనంగా గణతంత్ర దినోత్సవం

నంద్యాల (పల్లెవెలుగు) 26 జనవరి: స్థానిక పట్టణం లోని అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ కార్యాలయంలో అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల జనరల్ సెక్రటరీ జి.ఎం. గౌస్ అధ్యక్షతన ముఖ్య అతిధులుగా నంద్యాల ముస్లిం జే.ఎ.సి. అధ్యక్షులు అబులైస్, తెలుగుదేశం రాష్ట్ర  మైనారిటి అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ  ఎందరో వీరుల త్యాగ ఫలం ఆగస్టు 15 స్వతంత్ర దినం మనకోసం మన భవిష్యత్తు కొరకు డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అమలులోకి అందుబాటులోకి వచ్చిన శుభదినం జనవరి 26 గణతంత్ర దినోత్సవం భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం సమాజ నిర్మాణమే మన ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే మన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమం లో అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నంద్యాల అధ్యక్షులు మౌలానా అబ్దుల్ రహిమాన్, ఉపాధ్యక్షులు ఉస్మాన్, హమీద్, అసదుల్లా మియా, మౌలానా అబ్దుల్లా,  కోశాధికారి హాఫిజ్ మజీద్, సహాయ కార్యదర్శి హాఫిజ్ మొహమ్మద్ ఇలియజ్ కార్యదర్శులు హాఫిజ్ సలీం, జైనులాబ్దీన్ కాంగ్రెస్ పార్టీ చింతల మోహన్ రావు, అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు పాల్గొన్నారు.

Back to top button