NandyalAbdul Javid

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టాలి –  జానో జాగో డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టాలి –  జానో జాగో డిమాండ్

నంద్యాల (పల్లెవెలుగు) 25 జనవరి: మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో 25 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. అని అందులో 3 జిల్లాలకు భారతరత్న  ప్రముఖ భారత స్వతంత్ర సమర యోధులు భారత తొలి విద్యాశాఖ మంత్రి  అయిన ( మౌలానా అబుల్ కలాం ఆజాద్) పేరును మరియు భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి , ప్రముఖ శాస్త్రవేత్త (ఏపీజే అబ్దుల్ కలాం) పేరును భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత (డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్) పేరును అలాగేఎన్నికల ముందు కృష్ణాజిల్లాని నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తా అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారని అన్నారు ఆ మహనీయుల పేర్లను నామకరణం చేయాలని కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ సంఘాలు సంస్థలు ముస్లిం మైనారిటీ నాయకులు యువత లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరూ స్పందిస్తారని ఆశిస్తున్నాము ఆయన అన్నారు

Back to top button