NandyalAbdul Javid

రజకుల ఎస్సీ జాబితా కోసమే రజక ఎస్సీ సాధన సమితి లక్ష్యం

రజకుల ఎస్సీ జాబితా కోసమే రజక ఎస్సీ సాధన సమితి లక్ష్యం

నంద్యాల (పల్లెవెలుగు) 09 జనవరి: ఏపీ రాష్ట్రంలో రజకుల ఎస్సీ జాబితా కోసమే రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు అన్నారు. నంద్యాల పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం వెనుక రెవిన్యూ నిశాంతి భవన్ నందు ఎపి రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు స్సమక్షంలో నంద్యాల పార్లమెంట్, పట్టణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పార్లమెంటు కమిటీ అధ్యక్షుడిగా ఎం.వి. రమణ, ఉపాద్యక్షులుగా కౌలూరు రజక శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి గా కైరుప్పల ప్రసాద్, కార్యదర్శిగా సి.బాబయ్య, సహాయ కార్యదర్శి గా కె.సి సంజీవరాయుడు, కోశాధికారి గా చంద్రగిరి మహేష్ లు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అదేవిధంగా నంద్యాల పట్టణ కమిటీ అధ్యక్షుడిగా రాయమాపురం సి.మద్దిలేటి, ఉపాధ్యక్షుడుగా ఎస్.రాజేష్ , ప్రధాన కార్యదర్శిగా నీలం నాగరాజు, కార్యదర్శి గా సి.శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి గా సి.నాగశేషు, కోశాధికారిగా సి.సుబ్రమణ్యం లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో రజకులు ఎంతో వెనుకబడి పోయారని, రజక జాతి అభివృద్ధి, సంక్షేమం కోసమే రజక ఎస్సీ సాధన చైతన్య సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ రోజు నంద్యాల పార్లమెంటు జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందిని నా వెంట రజక ఉద్యమంలో సభ్యులుగా చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రజక ఎస్సీ సాధన చైతన్య సమితిని రాయలసీమ జిల్లాల్లో బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

Back to top button