5వ తేదీ జరిగే జిల్లా మహాసభ విజయవంతం చేయండి – pdsu

 5వ తేదీ జరిగే జిల్లా మహాసభ విజయవంతం చేయండి

 5వ తేదీ జరిగే జిల్లా మహాసభ విజయవంతం చేయండి

నంద్యాల (పల్లెవెలుగు) 03 జనవరి:  విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కర్నూలు నగరంలో ఈనెల 5 వ తేదీ జరిగే PDSU జిల్లా మహాసభ అంబేద్కర్ భవనంలో విజయవంతం చేయండి. నంద్యాల పట్టణంలో పిడిఎస్యు ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు నెంబర్ షిప్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా S.M.D. మాట్లాడుతూ రాష్ట్రములో ఉన్న ప్రభుత్వ సంక్షేమ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్ లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీలో నేలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యార్థుల ధరలకు అనుగుణంగా కాస్మొట్ మెస్ చార్జెస్ పెంచి, పెండింగ్ లో కాస్మొటిక్ చార్జీలు విడుదల చేసి పక్క భవనాలు ఏర్పాటు చేయాలన్నారు. మంచి నీటి వాటర్ ప్లాంట్స్ , సరిపడు మరుగు దొడ్లు, నాణ్యతమైన ఆహారం అందించి విద్యార్థులుకు ట్రంక్ పెట్టలు, దుస్తులు, దుప్పట్లు ,దోమ తెరలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ హాస్టల్ లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్, కామాటి, వాచ్ మాన్, ట్యూటర్స్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసి, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ స్కాలర్ షిప్ విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్శిటీ లకు 100 కోట్లు చొప్పున నిధులు కేటాయించి ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు  జిల్లాలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలి అన్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల పక్షాన నిలబడి అని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడవక ముందే జీవో నెంబర్ 77 ను తీసుకొని వచ్చి పీజీ విద్యార్థులను చదువులకు దూరం చేసే విధంగా ఉందన్నారు పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న జగనన్న విద్యా దీవెన వసతి దీవెన విడుదల చేయాలని తెలిపారు.. ఎస్ ఎస్ బి ఎన్ విద్యా సంస్థలను ఎయిడెడ్ గా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి తక్షణమే నిధులు కేటాయించి సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నారు మహిళల విద్యార్థులుకు పక్క వసతిగృహం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు పట్టణ అధ్యక్షులు దస్తగిరి ప్రధాన కార్యదర్శి నవీన్, ఉపాధ్యక్షులు అజిత్, సహాయ కార్యదర్శులు రాకేష్ నాని ని తదితరులు పాల్గొన్నారు