Nandyal

క్రైస్తవ కమ్యూనిటి పై జరుగుతున్న దుర్మార్గాలను ఆపండి : M.K. ఫైజీ

క్రైస్తవ కమ్యూనిటి పై జరుగుతున్న దుర్మార్గాలను ఆపండి : M.K. ఫైజీ

నంద్యాల లోని స్థానిక సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా SDPI  కార్యాలయంలో సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు హాఫిజ్ అతావుల్లాఖాన్ మంగళవారం స్థానిక కార్యాలయం లో నిర్వహించిన పత్రిక సమావేశం లో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో  క్రైస్తవ కమ్యునిటి కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్రంగా దిక్కమాలినవి, దేశంలో క్రైస్తవులతో కలుపుకొని అన్ని మైనారిటిలకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ తమ హింసను ఆపాలని సోషియల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు M.K. ఫైజీ కోరారన్నారు. దేశంలో ముస్లిములపై ప్రబలించేంత,  క్రైస్తవ కమ్యునిటి పై దాడులు కొత్తవి ఏమి కావు. స్వాతంత్ర్యం రాక పూర్వమే దేశంలో ముస్లిములపై నిరంతర దాడులు సంఘ్ పరివార్ చేయించేదని  ముస్లిములపై దాడులు తీవ్రంగా ఉండేవి మరియు స్వాతంత్ర్యం తర్వాత క్రైస్తవులపై దాడి ఘటనలు మొదలైనాయి. రెండవ సర్ సంఘ్ చాలక్ గోల్వాల్కర్ తత్వం ప్రకారం దేశంలో క్రైస్తవవు అంతరంగిక రెండవ శత్రువు. ఈ మూఢులకు క్రైస్తవులు కొత్త ఎర ఏమికాదు. దేశవ్యాప్తంగా క్రైస్తవ కమ్యునిటి పై మరియు వారి ప్రార్ధన స్ధలాలపై మిలిటెంట్ హిందుత్వ ఫ్యాసిస్టుల చే లెక్కలేనన్ని హింస మరియు విధ్వంసం ఈ క్రిస్మస్ సాక్షిగా జరిగిందన్నారు. బిజెపి పరిపాలిత రాష్ట్రాలలో ఎడు చోట్ల క్రిస్మస్ ముందు మరియు క్రిస్మస్ రోజు దాడులు జరిగినాయి.

ఉదాహరణకు కొన్ని:

  • ఆగ్రాలో మిషనరీ నిర్వహించే స్కూల్ బయట రైట హిందు గ్రూప్ సభ్యులు శాంటక్లాజ్ బొమ్మను దహనం చేశారు.
  • అస్సాంలో క్రిస్మస్ ముందు సాయంత్రం ఇద్దరు కాషాయ నిరసనకారులు చెర్చిలో ప్రవేసించి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రార్ధనలను భంగం కల్గించారు.
  • హర్యానా లో పటౌడి లో గల పాఠశాల లో “జై శ్రీ రామ్” అంటు అరుపులతో కేకలు వేస్తురైట్ వింగ్ హిందుత్వ  హెచ్చరించే గ్రూప్ క్రిస్మస్  సాయంత్రపు ప్రార్ధనలను భంగం కల్గించారు.
  • ఉత్తరప్రదేశ్ లోని మాత్రిఢామ ఆశ్రమంలో క్రిస్మస్ ఈవెంట్ జరుగుతునప్పుడు దాని లక్ష్యంగా చేసుకొని హిందుత్వ హెచ్చరించే గ్రూప్ “మత మార్పిడి ఆపాలి” “మిషనరీ ముర్దాబద్” అని బయట నినాదాలు చేసింది.
  • 2014 లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని మతవిద్వేషాల రిలీఫ్ రిపోర్ట్ ప్రకారం 2016 నుంచి 2019 వరకు క్రైస్తవులపై క్రైమ్ 60% పెరిగిందన్నారు.

క్రైస్తవులకు వ్యతిరేకంగా రైట్ వింగ్ హిందుత్వ తీవ్రవాదులు తీసుకొన్న భయంకరమైన అడుగు ఏమిటంటే FCRA  రెన్యువల్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ను తిరస్కరించి మదర్ థెరిస్సా మిషనరీ ఆఫ్ ఛారిటి కార్యకలాపాలను అమాంతంగా నిలిపివేయటం. సంఘ్ పరివార్ ఏ విధంగా ముస్లిములపై దుర్మార్గంగా అసహ్యమును వ్యక్తపరిచిందో అదేవిధంగా నేడు క్రైస్తవులపై కూడా చేస్తుందని విద్వేషం, జాత్యహంకారం మరియు మతపరమైన శత్రత్వం సిధ్ధాంతాలతో RSS పుట్టి పెరిగింది. అన్ని మతాలను దేశంలో అంతం చేసి నియంత్రుత్వ బ్రహ్మాణ హిందుత్వ రాష్ట్రంగా మర్చలన్నది వారి యొక్క కడపటి లక్ష్యం. దేశంలో హిందూ మతం తప్ప అన్ని మతాల కమ్యునిటిలను  నిర్మూలించటానికి అన్ని విధాలుగా తయ్యరైంది. దేశంలో శాంతి సామరస్యంతో జీవించాలంటే RSS దాడులకు, దుర్మార్గాలకు బాధితులైన వారు అర్ధం చేసుకొని ఐక్యమై లేచి నిలబడి RSS అధ్యక్షత వహిస్తున్న రైట్ వింగ్  శక్తుల ఎజెండాను నిరోధించాలి మరియు ఓడించాలి అని M.K. ఫైజీ మరోమారు గుర్తు చేశారు.

Back to top button