NandyalAbdul Javid

అందరికీ విద్య ఉపాధి కై పోరాటానికి సిద్ధం కావాలి PDSU జిల్లా అధ్యక్షులు SK. జునైద్ బాషా

అందరికీ విద్య ఉపాధి కై పోరాటానికి సిద్ధం కావాలి PDSU జిల్లా అధ్యక్షులు SK.జునైద్ బాషా

నంద్యాల పట్టణ కార్యవర్గం నూతన ఎన్నిక

నంద్యాల (పల్లెవెలుగు) 22 డిసెంబర్: విద్యార్థులు, యువత అందరికీ సమానమైన శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పన కై పోరాటాలకు సిద్ధం కావాలని పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు SK. జునైద్ బాషా పిలుపునిచ్చారు. బుధువారం నాడు స్థానిక నంద్యాల పట్టణంలోని జూనియర్ కళాశాలలో పిడియస్ యు పట్టణ 3వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్బంగా జునైద్ బాష మాట్లాడుతూ కరువు కాటకాలతో నిరుద్యోగ యువకులు డిగ్రీలు పూర్తి చేసుకొని తగిన ఉద్యోగాల్లేక ఉపాధి కోసం వలస వెళుతున్నారని అన్నారు. ఇది తెలిసిన పాలక ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అందించడంలో విఫలంవుతున్నారుని రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు విద్యార్థులకు కల్పించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే జిఓ నెం 35,42,50,51 వెంటనే రద్దు చేయాలని దండ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన పీజీ విద్యార్థులకు ఉపకారవేతనాలు రాకుండా చేసేందుకు జిఓ 77ను ముందుకు తీసుకురావడంతో విద్యార్థులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విద్యార్థుల పక్షాన పోరాడుతుందని తెలియజేశారు.  కావున విద్యార్థులు యువత అందరికీ ఉచిత విద్య ఉపాధి కై పోరాటాలకు సిద్ధం కావాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా, సహాయ కార్యదర్శి రఫీ, PYL జిల్లా నాయకులు నవీన్ కుమార్, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎం శంకర్, IFTU జిల్లా నాయకులు చౌడప్ప పాల్గొనడం జరిగింది. అనంతరం పిడిఎస్ యు నంద్యాల పట్టణ కమిటీ ఏకగ్రీవంగా 13 మందిని ఎన్నుకోవడం జరిగింది. పిడిఎస్ యు పట్టణ అధ్యక్షడు దస్తగిరి, పిడియస్ యు కార్యదర్శి నవీన్ బాబు, పిడియస్ యు ఉపాధ్యక్షులు అజిత్, వెంకటేష్ సహాయ కార్యదర్శిగా రాజేష్, రాజు, కోశాధికారి వంశీ, సభ్యులు షాకీర్, కిరణ్ లను ఎన్నుకోవడం జరిగింది.

Back to top button