అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ముస్లిం జేఏసీ

అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ముస్లిం జేఏసీ

అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ముస్లిం జేఏసీ

నంద్యాల (పల్లెవెలుగు) నవంబర్ 21:- “కాల్ మనీ” వ్యవహారం లో వేధింపులకు గురై ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షాహిన్.నూర్ బాషా, దంపతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగిందని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ అబులైస్ తెలిపారు ఈ సందర్భంగా కో కన్వీనర్ అబ్దుల్ సమద్ మాట్లాడుతూ అధిక వడ్డీని వసూలు చేస్తూ అతి దారుణంగా మానవత్వం లేకుండా మనుషులను ఈ విధంగా బాధలకు గురి చేస్తున్న వ్యక్తులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి  డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్భాటాని వెళ్లి అధిక అప్పులు చేయొద్దని వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తుల దగ్గర అప్పు చేయకుండా భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే వడ్డీలేని రుణాలు ఇచ్చే సంస్థలలో చేరి తమ ప్రాణాలను కాపాడుకోవాల్సినదిగా నంద్యాల ముస్లిం జేఏసీ గా కోరారు. ఈ కార్యక్రమంలో  జేఏసీ నాయకులు గన్నీకరీం, అతావుల్లాఖాన్, సుహైల్ రానా, బాలాహాజీ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు