NandyalAbdul Javid

జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) ఆధ్వర్యంలో మైనారిటీ హక్కుల దినోత్సవం

నంద్యాల (పల్లెవెలుగు) 18 డిసెంబర్: జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్బాషా మాట్లాడుతూ అల్ప సంఖ్యాకులకు (Minorities) తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడం మైనారిటీ హక్కుల దినోత్సవం (Minorities Rights Day)  యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోజు భారతదేశంలోని ప్రతి రాష్ట్రం మైనారిటీలకు సంబంధించిన సమస్యలతో పాటు రాష్ట్రంలో వారి భద్రతపై దృష్టి పెడుతుంది. మైనారిటీల హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ సెమినార్లు, ప్రచారాలు మరియు కార్యక్రమాలు నిర్వహిస్తారు.  అలాగే 1993 నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18వ తేదీని మైనారిటీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. డిసెంబర్ 18నే ఎందుకు? మతం, భాష, జాతీయత లేదా జాతి ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో వివక్ష చూపడాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి 1992 డిసెంబర్ 18 న మైనారిటీలకు చెందిన వ్యక్తుల హక్కుల ప్రకటనను ప్రకటించింది.భారతదేశంలో మైనారిటీలు: భారత రాజ్యాంగం అల్ప సంఖ్యాక వర్గం (Minority) అనే పదాన్ని నిర్దిష్టంగా నిర్వచించనప్పటికీ మతపరమైన, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల గురించి ప్రస్తావించింది. భారత ప్రభుత్వం అల్ప సంఖ్యాక వర్గాల కోసం జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టం – 1992 ను రూపొందించింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 2(C) కింద భారతదేశంలో 06 మతాలను మైనారిటీలుగాగుర్తించారు.

అవి:-

  1.  ముస్లింలు
  2.  సిక్కులు
  3.  క్రైస్తవులు
  4.  బౌద్ధులు
  5.  జొరాస్ట్రియన్లు (పార్సీలు)
  6. జైనులు (Jains)

2014 జనవరి 17న కేంద్ర ప్రభుత్వం జైనులను మైనారిటీలుగా గుర్తించింది భారతదేశంలో మైనారిటీలు 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో 19% ఉన్నారు. 2006 జనవరి 29 న కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి మైనారిటీలను వేరుచేసి వారికి ప్రభుత్వ విధానాలు మరింత చేరువయ్యేలా ప్రత్యేకంగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కోట్ల ఖలీల్ మహాదేవపురం మదర్ కొట్టాల నజీర్ కాకరవాడ జలీల్ పాల్గొన్నారు.

Back to top button