Nandyal

నోబెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోయంబత్తూర్ నందు విజయం సాధించిన నంద్యాల క్రీడాకారుడు

నోబెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోయంబత్తూర్ నందు విజయం సాధించిన నంద్యాల క్రీడాకారుడు

నంద్యాల (పల్లెవెలుగు) 08 డిసెంబర్: స్థానిక పట్టణానికి చెందిన నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీ కి చెందిన క్రీడాకారుడు డి రెహాన్ ఇటీవల జరిగిన నోబెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కోయంబత్తూర్ నందు U/10  విభాగంలో విజయం సాధించారని నంది సంస్థల ఎండి సుజల తెలిపారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఇందుకు సహకరించిన కోచ్ నాగార్జున సహాయక బృందాన్ని అభినందించారు. ఇటువంటి క్రీడాకారులకు నంది సంస్థల నుండి ఎల్లప్పుడు సహాయ సహకారాలు ఇస్తామని ఇందుమూలంగా త్వరలో నంది పైప్స్ బ్యాడ్మింటన్ అకాడమీ అంతర్జాతీయ స్థాయిలో నూతన రూపకల్పన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బ్యాడ్మింటన్ కార్యదర్శి వంశీధర్ మాట్లాడుతూ రెహన్ కోయంబత్తూర్ నుండే కాకుండా హైదరాబాద్ బెంగళూరు పలు టోర్నమెంట్ నందు విజయం సాధించాడని తెలిపారు. ఈ అకాడమీ నుండి చాలా మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ కోచ్ వెంకట్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు వి. శేషి రెడ్డి, సంజీవరెడ్డి కోచ్ నాగార్జున సహాయ కోచ్చు చిన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

Back to top button