Nandyal

జానో జాగో ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నివాళి

జానో జాగో ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి నివాళి

నంద్యాల (పల్లెవెలుగు) 06 డిసెంబర్: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి కార్యక్రమం జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా ఆధ్వర్యం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రతిభ చైర్మన్ ఎన్ జావిద్,  పఠాన్ మస్తాన్ ఖాన్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగ కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. దేశం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసే మహానుభావుడని భారత రాజ్యాంగం రచనలో కీలక పాత్ర పోషించారని అలాగే దేశం అంటే దేశ ప్రజలంతా ఒకటి అని బడుగు బలహీన పేద మధ్యతరగతి అన్న బేధం లేకుండా అందరూ భారత దేశ బిడ్డలే అని దేశం కోసం పాటుపడే నాయకుడు అని వారు కొనియాడారు.  ప్రజాస్వామ్యం, లౌకికవాదం,  కాపాడేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Back to top button