Abdul JavidNandyal

నాతియా ముషాయిరా గోడపత్రిక విడుదల

నంద్యాల (పల్లెవెలుగు) 25 అక్టోబర్:  ఎస్బిఐ కాలనీలోని మస్జిదే రసూల్ లో 30-10-21 శనివారం రాత్రి  ఉర్దూ కవిగాయకుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఇత్తేహాదుల్ ఉలేమాసంఘ అధ్యక్షులు ముఫ్తీ మౌలానా ముహమ్మద్ షఫీవుల్లాహ్ తెలిపారు. జనాబ్ అబ్దుల్ సమద్, నంద్యాల జమాఆతె ఇస్లామి అధ్యక్షులు, ఇమామ్ హాఫీజ్ ముహమ్మద్ సలీం పర్వేజ్, మౌలానా అబ్దుల్ వాజీద్, ముల్లా అబ్దుల్ హుసేన్, అజీజ్ పర్వేజ్, ఇంతియాజ్, అబ్దుల్ మాలి  తదితర ఆలిములతో కలిసి గోడ పత్రిక విడుదల చేసారు. ఈ సందర్భంగా ముఫ్తీ షఫీవుల్లా, అబ్దుల్ సమద్, హాఫీజ్ సలీం మాట్లాడుతూ ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదిన వేడుకలొ భాగంగా ఏర్పాటు చేసిన ఉర్దూ కవి సమ్మేళనంలో ప్రముఖ గేయ కారులు ప్రతాప్ ఘడ్ నుండి హాఫీజ్ సాబీర్ సిద్దీఖి సాబ్, యూపి తన్వీర్ బదాయూన్, హైదరాబాద్ అబ్దుల్ రెహమాన్, నెల్లూర్ హాఫీజ్ ఉస్మాన్, మౌలానా తయ్యిబ్ ఇంకా పలు జిల్లాల నుండి ప్రముఖ ఉర్దూ కవులు పాల్గొని ప్రవక్త ముహమ్మద్ (స) గుణగణాలు, జీవిత అంకాలు గేయ రూపంలో శ్ర్యావ్యంగా వినిపిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమి మాజి చైర్మెన్ డా. ముహమ్మద్ నౌమాన్, హైదరాబాద్ ఆఫీసర్ హుసేని, యన్.యండి.ఫిరోజ్, కౌన్సిలర్లు పాల్గొంటారు. ఈ కవి సమ్మేళనంలో ఉర్దూ ప్రియులు, ముస్లిం సోదరులు పాల్గొనాలని మౌలానా షఫీవుల్లా కోరారు.

Back to top button