Abdul JavidNandyal

రాజకీయ పార్టీలు రాజకీయాలు హుందాగా చేయాలి

మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్

నంద్యాల (పల్లెవెలుగు) 24 అక్టోబర్: స్ధానిక  MPJ కార్యాలయం లో నంద్యాల పట్టణ అధ్యక్షుడు అబూబకర్ సిద్దిఖి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత  ప్రాకులాట కోసం ధర్నాలు దీక్షలు చేయడం మంచి పద్ధతి కాదు. రాష్ట్రంలో  దేశంలో ప్రజా సమస్యలయిన పెట్రోల్ డీజిల్  గ్యాస్ విద్యుత్ బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజల సంపద ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీ పరం చేయడాన్ని ఈ సమస్యలపై పోరాడకుండా వ్యక్తిగత ప్రాకులాట కోసం ప్రజలను ఇబ్బంది పెట్టటం మంచి పద్ధతి కాదన్నారు.  పార్టీ నేతల మాటలు చూస్తుంటే ప్రజలు ప్రజల సమస్యల గురించి చర్చించకుండ వారి మైండ్ సెట్ మార్చేందుకు పన్నాగాం పన్నట్లు అనిపిస్తుంది. అలా కాకుండా మంచి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల హృదయాలు గెలుచుకోవాలగాని, తిట్లతో, దాడులతో కాదని, ప్రజా సంక్షేమం కోరే ఒక ప్రజా సంస్థగా ఎంపీజే ప్రజల తరఫున రాజకీయ పార్టీలకు తమ అభిప్రాయం తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అబూబకర్ సిద్దిక్, కార్యదర్శి ఆన్సర్ భాష, ఉపాద్యక్షులు సద్దాం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button