Abdul JavidNandyal

గాజులపల్లె జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులను  వెంటనే నియమించాలి

నంద్యాల (పల్లెవెలుగు) 23 అక్టోబర్: నంద్యాల ఆల్ మేవ డివిజన్ అధ్యక్షులు ఇమ్రాన్ పాషా మరియు గౌరవ  అధ్యక్షులు ఎస్.ఎమ్.డి అబుల్ లైస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఛాహత్ బాజ్పై ని కలిసి గాజులపల్లె  ZPHS ఉర్దూ పాఠశాల లో ఉర్దూ ఉపాధ్యాయుల కొరత ఉండడంవల్ల అక్కడ 70 మంది విద్యార్థినులు విద్యా పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యాభివృద్ధికి తోడ్పడాలని గౌరవ అధ్యక్షులు తెలిపారు. సబ్ కలెక్టర్ స్పందించి జిల్లా విద్యాధికారితో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామన్నారు, ఈ కార్యక్రమంలో గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button