Abdul JavidNandyal

ఘనంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 21 అక్టోబర్: మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  యూత్ సురేష్ , మోహన్ కుమార్ ఆధ్వర్యంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని బొమ్మల సత్రం లో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  అభిమానులతో కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం సురేష్ ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ బ్యాంక్ 130 మంది మలికిరెడ్డి యూత్ సభ్యులు రక్తదానం చేశారు. అనంతరం పరివర్తన లైఫ్ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం, కాంతినగర్ అంధుల పాఠశాల లో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదువులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం, సంపాదనలో కొంత ప్రజాసేవకే ఉపయోగిస్తాను. ప్రజల అభిమానమే శ్రీరామ రక్ష. నంద్యాల ప్రజల అభిమానానికి రుణపడిఉంటా ప్రజా సేవకు జీవితం అంకితం చేస్తా పేద ప్రజలకు త్వరలో తక్కువధరకు ప్రభుత్వ ఆస్పత్రివద్ద బోజనవసతి కల్పిస్తానని అన్నారు.  పాల్గొన్న పేర్లు మాలికిరెడ్డి గంగా చరణ్ రెడ్డి, తులసి రెడ్డి , బ్రహ్మ రెడ్డి, హుసాని, వెంకటేష్, రామకృష్ణ, జమాల్, ఉత్తేజ్ , చిన్న, నాగార్జున, సిమెంట్. ప్రసాద్ రెడ్డి, అబ్దుల్లా మరియు అభిమాను కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button