Abdul JavidNandyal

ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి

  • అవగాహన కల్పించడానికి
  • నంద్యాల టు కర్ణాటక నాన్ స్టాప్ రైడ్ ద్విచక్రవాహనంపై.

నంద్యాల (పల్లెవెలుగు) 19 అక్టోబర్:  పట్టణానికి చెందిన ఆర్జిత్ ఎజె  అనే మోటో వ్లాగర్ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూ  నంద్యాల నుండి కర్ణాటక రాష్టం లోని మురుదేశ్వర్ పట్టణానికి దాదాపుగా 800 కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హెల్మేట్ తప్పని సరిగా ధరించాలని ఆర్జిత్ తెలిపారు. తన ఈ రైడ్ ఇటీవలే నంద్యాల పరిసర ప్రాంతాల్లో జరిగిన రోడ్ ప్రమాదాల్లో మరణించిన వారికి అకంకితం ఇస్తూనేట్టు తెలిపారు.. ఈ సందర్బంగా ఆర్జిత్ మిత్రులు తన రైడ్ విజయవంతం కావాలని కోరుకున్నారు! అదే సంద్భంలో తన తరువాతి రైడ్ గురించి కూడా తెలియజేస్తూ  నంద్యాల నుంచి కన్యాకుమారి వరకు తన తరువాతి రైడ్ ఉంటుంది అని ఆర్జిత్  తెలియచేశారు. కన్యాకుమారి రైడ్ చేయటం ద్వారా తన సౌత్ ఇండియా పూర్తి అవుతుంది అని కూడా తెలియ చేశారు.  మరీ ఎన్నో రైడ్ స్ చేస్తారని ఆయన అన్నారు.

Back to top button