Abdul JavidNandyal

ఎస్బిఐ కాలనీ వెళ్ళాలంటే నడుము పట్టాల్సిందె…గుంతలు పూడ్చండి  –  విశ్రాంత ఉద్యోగి సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 19 అక్టోబర్: ఎస్బిఐ కాలనీ నంద్యాలలో చాలా ప్రశస్తమైనది, ఎన్నో అపార్ట్మెంట్ లకు కేంద్రం. అయితె మెయిన్ రోడ్డు నుండి ఎస్బిఐ కాలనీకి వెళ్ళు ముఖద్వారం వద్ద పైపుల కోసం తవ్విన గుంత ఏండ్లు గడచిన పూర్చటం లేదు. దీని ద్వారా వెళ్ళే టూవీలర్, ఆటోలో ప్రయాణిస్తున్న వారి నడుములు నొప్పి పడుతున్నాయని ముసలివారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని కాలనీ వాస్తవ్యులు, విశ్రాంత ఉద్యోగి షేక్ అబ్దుల్ సమద్ తన బాధ వ్యక్తపరిచారు. అది ఏ అధికారి పట్టించుకోవాలో తేల్చి గుంతలను పూడ్పించాలనీ సమద్ కోరారు. పైగా తెల్లవారుజామున కుక్కలు గుంపులుగా తిరిగి వాకింగ్ బాటసారులకు భయం కలిగిస్తున్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు కుక్కల బెడద లేకుండా చూడాలని విజ్ఞప్తి చేసారు.

Back to top button