Nandyal

ఘనంగా శ్రీ పబ్బు వీరయ్య మెమోరియల్ పి.టీ.కప్ రజితోత్సవ వేడుకలు

నంద్యాల ( పల్లెవెలుగు) 19 అక్టోబర్: ఆర్ కె  బ్యాడ్మింటన్ అకాడమీ నందు శ్రీ పబ్బు వీరయ్య మెమోరియల్ పి.టీ.కప్ రజితోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామకృష్ణ రెడ్డి  మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో బ్యాడ్మింటన్ ఆటకు ఎంతో ఆదరణ ఉందని తమ వంతు సహకారం  ఎప్పుడు అందిస్తున్నామని అలాగే  పబ్బు తులసి కృష్ణ  గత 25 సంవత్సరాల నుండి బ్యాట్మెంటన్ క్రీడలు ఎక్కడ జరిగినా సరే వారు ఎంతో సహకరిస్తున్నారని అటువంటి వారు నంద్యాల పట్టణంలో ఉండటం నంద్యాల పట్టణానికి గర్వకారణమని అని తెలిపారు..  కర్నూలు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రెటరీ  వంశీ   మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన బాడ్మింటన్ స్టేడియాలు మూడు ఉన్నాయని వీటిని చాలా మంది క్రీడాకారులు వినియోగించు కుంటున్నారని వారందరికీ సహాయ సహకారాలు అందిస్తున్న టువంటి, రామకృష్ణా రెడ్డి మరియు డాక్టర్ లక్ష్మయ్య , వినోద్,  శ్రీనివాస గుప్తా లను   ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పబ్బు తులసి కృష్ణ  ఈ రజితోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి సంవత్సరం బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తానని తెలపడం చాలా సంతోషించదగ్గ విషయం అని తెలిపారు.. నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ లక్ష్మయ్య  మాట్లాడుతూ పబ్బు తులసి కృష్ణ 67 సంవత్సరాల వయసులో కూడా చురుగ్గా బ్యాట్మెంటన్ ఆడుతూ ఎన్నో టోర్నమెంట్ లో పాల్గొని పథకాలు సాధించారని వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని క్రీడాకారులు అందరూ ప్రతిరోజు బ్యాడ్మింటన్ సాధన చేయాలని కోరారు. డాక్టర్ వినోద్ మాట్లాడుతూ తులసి కృష్ణ  బ్యాడ్మింటన్ క్రీడ కు తన వంతు సహకారం గా ఎప్పుడు ముందుంటారని వారు ఎటువంటి సహకారం కోరిన తాము అందిస్తామని తెలిపారు.  డాక్టర్ పాండురంగారావు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో పబ్బు తులసి  కృష్ణ  బ్యాడ్మింటన్ తో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇటువంటి దాతలు ఉండడం ద్వారా బాడ్మింటన్ క్రీడకు  మరింత బలం చేకూరుతుందని తెలిపారు. పబ్బు తులసీ కృష్ణ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో తాను 35 సంవత్సరాలుగా బ్యాట్మెంటన్ ఆడుతున్నానని అప్పటినుండి బ్యాడ్మింటన్ క్రీడ కు  తన వంతు సహకారం గా ప్రైజులు డొనేట్ చేస్తున్నానని ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి మరిన్ని టోర్నమెంట్ను లు నిర్వహించాలని  ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకి క్రీడాకారులకు క్రీడా అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కోచ్ T.రాధాకృష్ణ , నాగార్జున, విలేకరులు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button