Abdul JavidNandyal

సచివాలయం కార్యదర్శి సుధాకర్ ను విధుల నుండి తొలగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ముస్లిం ప్రజా సంఘాలు

నంద్యాల (పల్లెవెలుగు) 18 అక్టోబర్: స్సచివాలయం కార్యదర్శి సుధాకర్ ను విధుల నుండి తొలగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన ముస్లిం ప్రజా సంఘాలు అనంతరం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఇద్రీస్ షేక్, అవాజ్ కమిటీ అధ్యక్షులు బాబుల్లా మైనారిటీ రైట్స్ ఫోరమ్ నాయకులు మహబూబ్ బాషా,  మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ముల్లా ఖాజా హుస్సేన్,  ముస్లిం హక్కుల పోరాట సమితి  నాయకులు యూనుస్,  సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు కరిముల్లా,  ముస్లిం లీగ్ పార్టీ నాయకులు మౌలానా సలాం,  ఇన్సాఫ్ కమిటీ నాయకులు షరీఫ్,  పి.డి.యస్.యు నాయకులు రఫీ మాట్లాడుతూ ఈ నెల 7వ  తేదీన నంద్యాల పట్టణంలోని స్థానిక 26వ వార్డు సచివాలయం సంక్షేమ కార్యదర్శి సుధాకర్ షాబాన అనే ముస్లిం మహిళపై దాడి చేయడం జరిగిందని దీనిపై ఇప్పటికే ఈ సమస్యను మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణకు మరియు జిల్లా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అయిన కూడా ఇంత వరకు సుధాకర్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని కావున ఇప్పటికైనా స్పందించి 26వ వార్డు సంక్షేమ కార్యదర్శి సుధాకర్ పై విచారణ చేపట్టి శాశ్వతంగా విధుల నుండి తొలగించాలని  సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎదుట ధర్నా నిర్వహించడం జరిగిందని అనంతరం సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ కు వినతిపత్రం అందించడం జరిగిందని వారు తెలిపారు. అదేక్రమంలో భాదితురాలు షాబాన ఆమె తమ్ముడి పై పెట్టిన అక్రమ కేసును కూడా ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటన మరో మహిళకు జరగకుండా మళ్ళీ  పునరావృతం కాకుండా సచివాలయలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడ జరుగుతున్న అవినీతిపై కూడా నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞేప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు

Back to top button