Abdul JavidNandyal

సౌభ్రాతృత్వం, సమభావన బలోపేతం కావాలి

  • బహుళ జన సముదాయాల మధ్య స్నేహంతో పాటు దేశాభివృద్ధికి పాటుపడదాం
  • ఆల్‌ ఇందియా మిల్లి కౌన్సిల్‌ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ముస్తఫా రఫాయి
  • నంద్యాల డివిజన్‌ నూతన కమిటీ ఏర్పాటు

నంద్యాల (పల్లెవెలుగు)17 అక్టోబర్:  దేశంలోని బహుళ జన సముదాయాల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం, సమభావన, సహనం, సామరస్యం బలోపేతం కావాలని, అందుకు దేశంలోని అన్నివర్గాలు తమ వంతు కృషి చేయాలని మిల్లీ కౌన్సిల్‌ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి హజరత్‌ షా ఖాద్రి సయ్యద్‌ ముస్తఫా రఫాయి పేర్కొన్నారు. శనివారం నంద్యాల డివిజన్‌ నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిల్లీ కౌన్సిల్‌ దేశంలోని సామాజిక వర్గాల మధ్య ఐక్యత, సామరస్యం, సోదరభావం, స్నేహం బలపడేందుకు మిల్లీ కౌన్సిల్‌ కృషి చేస్తుందన్నారు. అక్షర జ్ఞ్యనం తోనే ఆభివృద్ధి సాధ్యమని, ప్రతిభ ఉన్న పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యారులు ఉన్నత విద్యను అభ్యసించలేక పోతున్నారని, అటువంటి వారికి ఉచిత విద్యను అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ కార్యవర్గసభ్యులు సులేమాన్‌ ఖాన్‌,  ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ ఖదీర్‌ నిజామి, రాష్ట్ర కార్యదర్శి షైక్ మునీర్‌ అహ్మద్‌ లు మాట్లాడుతూ మిల్లీ కౌన్సిల్‌ ముస్లిం సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని దేశాభివృద్ధికి పాతుపడుతుందని, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా మిల్లీ కౌన్సిల్‌ పని చేస్తుందని వివరించారు. 1992లో మిల్లీ కౌన్సిల్‌ను ప్రారంభించడం జరిగిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మిల్లీకౌన్సిల్‌ పనిచేస్తుందని, ఎపిలో కూడా జిల్లాల కమిటీలతో పాటు డివిజన్‌ స్థాయిలో పనిచేసేందుకు నేడు నంద్యాల డివిజన్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కౌన్సిల్‌ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని, జాతీయ అభ్యున్నతి, అభివృద్ధి, శాంతికోసం పనిచేస్తుందని వివరించారు. ఆనంతరం మిల్లీ కౌన్సిల్‌ నంద్యాల డివిజన్‌ అధ్యక్షునిగా అబ్దుల్‌ రహిమాన్‌ రషాది, ప్రధాన కార్యదర్శిగా జిఎం గౌస్‌, ఉపాధ్యక్షులుగా అబ్దుల్‌ రషీద్‌, షేక్‌ ఉస్మాన్‌ బాష, అబ్దుల్‌ హమీద్‌, సహాయ కార్యదర్శిగా మొహమ్మద్‌ ఇద్రిస్‌ షేక్‌, కోశాధికారిగా అబ్దుల్‌ మజీద్‌లను మిల్లీ కౌన్సిల్‌ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ ముస్తఫా రఫాయి ప్రకటించారు. వీరితో పాటు మిల్లీ కౌన్సిల్‌ పూర్తి కమిటీతోపాటు 12 అనుబంధ్‌ విభాగాల బాధ్యులను ప్రకటించడం జరుగుతుందన్నారు.

Back to top button