Abdul JavidNandyal

నంద్యాల నందు కేంద్రీయ విద్యాలయo స్థాపించoడి

నంద్యాల (పల్లెవెలుగు) 15 అక్టోబర్: ఆల్ మేవ గౌరవ అధ్యక్షులు ఎస్.ఎమ్.డి అబులైస్ అధ్యక్షులు ఇమ్రాన్ పాషాల ఆధ్వర్యంలో నంద్యాల ఎంపి పోచ బ్రహ్మానందరెడ్డి ని వారి ఆఫీసు లో కలిసి నంద్యాలలో పోస్టల్, రైల్వేస్, LIC, NHAI, CSC, లాంటి పలు సంస్థలలో పని చేయుచున్న సుమారు 2000 వరకు ఉద్యోగస్తులు ఉన్నారు. వారి పిల్లలకు సరియైన పాఠశాల లేక ఇబ్బంది పడుతున్నారు  కావున  కేంద్రీయ విద్యాలయం నంద్యాలలో ఏర్పాటుకు  మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎంపి స్పందిస్తూ నంద్యాలకు కేంద్రీయవిద్యాలయం మంజూరు అయ్యిందని కానీ స్థల సేకరణ లో జాప్యం జరుగు తున్నదని తెలిపారు. కావున ప్రభుత్వం త్వరితగతిన కేంద్రియ విద్యాలయ స్థాపనకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ మేవా  సెక్రెటరీ   నబిరసూల్, ఖాసిం , జుబేర్ పాల్గొన్నారు

Back to top button