Abdul JavidNandyal

సివిల్ సప్లై హమాలీల పోరాటానికి మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఫరూక్ మద్దతు

నంద్యాల (పల్లెవెలుగు) 09 అక్టోబర్: పట్టణంలోని సీడబ్ల్యూసీలో పనిచేసే 112 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రిలే నిరాహార దీక్షలను సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ దీక్షలలో శివలింగం బ్యాచ్ నందు పనిచేయుచున్న 30 మంది హమాలీ కార్మికులు కూర్చున్న వారందరికి పూలమాల వేసి ప్రారంభించడం జరిగింది. ఈ దీక్షా కార్యక్రమానికి సిఐటియు పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, యూనియన్ నాయకులు రామకృష్ణ, S.MD.హానీఫ్ ,సురేష్ ,వెంకటరమణ,పరమేష్ లతో పాటు 100 కార్మికులు పాల్గోన్నారు.

ఈ దీక్షలను టిడిపి ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు ఎం ఎండి దీక్షలను సందర్శించి మద్దతు ప్రకటించడం జరిగింది అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్  మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడంలో వేగవంతంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారని, దానిలో భాగంగానే సీడబ్ల్యూసీలో గత 30 సంవత్సరాల నుంచి నిల్వ ఉంచుతున్న బియ్యంను, గత 7నెలల నుండి ప్రైవేట్ గొడౌన్ లకు తరలింపు చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 15 కిలోమీటర్ల రవాణా చార్జీలు అదనపు భారం అవుతున్న అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లాభాలను అర్జిస్తూ,  ప్రైవేటు గోడౌన్లలో బియ్యం నిల్వ ఉంచేలా చూసేందుకు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు లక్షలలో డబ్బును ముట్టజెపుతున్నారని, దీనివల్ల హమాలీలకు పనులు లేకుండా చేస్తున్నారని, ఇప్పటికే రాష్ట్ర సివిల్ సప్లై మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ ఐ.ఎ.ఎస్ కి, కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, అదేవిధంగా నంద్యాల సిడబ్ల్యుసిలో ఉన్న రెండు గొడౌన్ లను రిలయన్స్ సంస్థ లీజుకు తీసుకున్నదని, 2గోడౌన్ లలో  ఎగుమతి, దిగుమతి జరిగే వాటిని హమాలీలకు పని ఇవ్వాలని డిమాండ్ చేశారు

Back to top button