Abdul JavidNandyal

ప్రతి మస్జిద్ లో మదరసా నిర్వహించండి

జమాఆతె ఇస్లామి హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 07 అక్టోబర్: ప్రతి మస్జిద్ లో పూర్తి స్థాయి లేదా ఉదయం సాయింత్రం పార్ట్ టైమ్ మదరసాలు కిండర్ గార్టెన్ లేదా అంగన్వాడీ టైపులో ఇమాములు కొద్దిగా శ్రద్ధ తీసుకుని నిర్వహించాలని నంద్యాల జమాఆతె ఇస్లామి హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మస్జిద్ కమిటీలకు, ఇమామ్ లకు అభ్యర్థించారు. ప్రతి వీధి మస్జిద్ పరిధిలో 3 – 5 సంవత్సరాల పిల్లలకు పాఠశాలలకు పంపలేని దైన్య స్థితిలో చాలామంది పేదలు ఉన్నారని, వారి పిల్లలకు కనీస ప్రాధమిక స్థాయి విద్యకు అలువాటు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇమాముల పట్ల ఉదారంగా వ్యవహరించాలని వారి పట్ల గౌరవంగానే కాదు ఆర్ధిక ఉపలబ్దికి తోడ్పడాలన్నారు. యువత మస్జిద్ లలో పిల్లలకు ఉచితంగా బోధించటానికి ముందుకు రావాలన్నారు. ప్రవక్త ముహమ్మద్ (స) మస్జిద్ లలో ఆర్థిక, వ్యాపార, న్యాయ వ్యవహారాలు నిర్వహించారు, వివాహాలు జరిగేవి అని సమద్ గుర్తు చేసారు. ప్రతి మస్జిద్ ఏరియాలో ఓ ‘దారుల్ ఖజా’ వెలయాల్సిన అవసరం ఎంతైనా ఉందని  సమద్ ఆశాభావం వ్యక్త పరిచారు.లక్షలు వెచ్చించి విశాలమైన మస్జిద్ లు నిర్మిస్తున్నామని అవి సమాజానికి ఉపయుక్తం కావాలని , కరోనా కాలంలో చాలాచోట్ల మజీదులు షెల్టర్ ఇవ్వటం శుభపరిణామంగా సమద్ ఆకాంక్షించారు. మదరసాల నిర్వహణకు మస్జిద్ లు ఉపయుక్తంగా మలిచే ప్రయత్నంలో  ముస్లిం సమాజం నడుంబింగించాలని సమద్ కోరారు.

Back to top button