
వృద్ధులకు అన్నదానం
నంద్యాల (పల్లెవెలుగు) అక్టోబర్ 07: డివిజన్ పరిధిలోని బోయలకుoట్ల లో అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు భాను రూరల్ అండ్ అర్బన్ రిసెర్చ్ డెవలప్ మెంట్ సొసైటీ వ్యవస్తాపకుడు లయన్ ధనాల రవికాంత్ బాబు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది అనాధలు నిరాశ్రయులు వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం చేసిన దాత దేవర గుట్టు మాబు బాష , వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.ఇప్పటివరకు అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం చేసిన దాత దేవరగుట్టు మాబు బాష ఆయన గొప్ప మనస్సు కు కృతజ్ఞతలు తెలిపారు.ఆర్ధిక సహాయం చేసిన దాత విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రాఘవ బొజ్జ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే భావనతో ముందుకు వెళుతున్నాము అన్నారు.ఈ కార్యక్రమానికి సేవా పరిచర్య లో సందీప్,జయ, స్వాతి పాల్గొన్నారు.