Abdul JavidNandyal

రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

నంద్యాల (పల్లెవెలుగు) 06 అక్టోబర్: నంద్యాలకు చెందిన ప్రముఖ టీడీపి నేత మైనారిటీ లా ఆశాజ్యోతి అనునిత్యం మైనార్టీల సమస్యల పై పోరాడే మంచి పోరాట పటిమ గల యోధుడు మౌలానా  ముస్తాక్ అహ్మద్ కి తెలుగు దేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడుగా నియమించిన టీడీపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ సారథ్యంలో నంద్యాల నుంచి టీడీపి నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ నాయకులు, పెద్ద ఎత్తున అమరావతికి పయనం అయి టీడీపి అధినేత ప్రస్థుత ప్రధాన ప్రతీపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ని కలిసి వారికి పుష్ప గుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ముస్లిం ప్రజల హామీలను తక్షణమే అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేకపోతే టిడిపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

Back to top button