Abdul JavidNandyal

ఘనంగా ఏవి జస్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 06 అక్టోబర్:  పట్టణంలో మదర్ యూత్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నంద్యాల సిటీ కేబుల్ ఎండీ టిడిపి యువ నాయకురాలు ఎ.వి. జస్వంత్ రెడ్డి జన్మదినాన్ని వికలాంగులతో కేక్ కట్చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డిపి మస్తాన్ వలి, మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి మాట్లాడుతూ ఏవి జస్వంత్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు మరియు ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు సహకరిస్తూ ఆమె పోరాట పటిమను అభినందిస్తూ, ఆమె సేవా గుణాన్నికి ఆకర్షితులై ఆమె జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహిం చామని అని వారు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో ముందు ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మాలిక్ భాష, నరేంద్ర, శ్రీకాంత్, నబి రసూల్, మనన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button