Nandyal

రైతుల చావులకు కారణమైన కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని SDPI ధర్నా

నంద్యాల (పల్లెవెలుగు) 05 అక్టోబర్: స్థానిక శ్రీనివాస సెంటర్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా  కార్యక్రమం లో SDPI రాష్ట్ర నాయకులు హఫీజ్ మొహమ్మద్ అతవుళ్ల ఖాన్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ లకింపుర్ కెరీ లో రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న అమాయక రైతుల పై బిజెపి కేంద్రమంత్రి కొడుకు తన కాన్వాయ్ తో రైతులపై దూసుకెళ్లి తన రాక్షసత్వాన్ని చూపించాడు. ఈ దారుణమైన  ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. కాగా ఈ ఘటనలకు భిన్నంగా తన కొడుకుని రక్షించడానికి కేంద్ర మంత్రి అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. కేంద్ర మంత్రి కొడుకు ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భం గా  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. SDPI అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బాషా మాట్లాడుతూ ఈ రాక్షస కాండను నిరసిస్తూ కేంద్రమంత్రి కొడుకుని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. రైతు సంఘం నాయకులు కొమ్మ హరి మాట్లాడుతూ వ్యతిరేక చెత్త రైతు వ్యతిరేక చట్టాలపై శాంతియుతంగా నిరసన చేయడం రాజ్యాంగం ద్వారా పౌరుల స్వేచ్ఛా పూరితమైన హక్కు పౌరుల ప్రాథమిక హక్కులను కాల రాస్తున్న  వారిపై వెంటనే శిక్ష విధించి రాజ్యాంగంపై దేశ ప్రజల నమ్మకాన్ని సన్నగిన్నకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో SDPI అసెంబ్లీ కమిటీ సభ్యులు మజీద్ ఖాన్, కరిముల్ల, హనీఫ్, ఎజాస్, కలామ్ మరియు పాపులర్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ మరియు నంద్యాల డివిజన్ ప్రెసిడెంట్ ఫాజిల్ దేశాయ్, కార్యదర్శి ఇద్రిస్ షేక్, రైతు సంఘాల నాయకులు కొమ్మ హరి, మొహమ్మద్ పర్వేజ్, మునవర్, యూనుస్ మరియు SDPI కార్యకర్తలు పాల్గొన్నారు.

Pavani.S

Pavani .S Devotional, Reporter, Nandyal Dist
Back to top button