Abdul JavidNandyal

రాయసీమా ప్రజా నిరాహారదీక్షకు సంపూర్ణ మద్దతు

నంద్యాల (పల్లెవెలుగు) 4 అక్టోబర్: సోమవారం రాయసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రాయసీమా ప్రజా నిరాహారదీక్ష కు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కర్నూలు జిల్లా కమిటీ తరపున జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీమ్ ఆధ్వర్యములో సంపూర్ణ మద్దతు తెలపడం జరిగినది. క్రిష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ లో సవరణలపై ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ ఒక్కరోజు దీక్షలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికలో ఆరు మంది సభ్యులు కూర్చోవడం జరిగినది. ఆంధ్ర  ప్రదేశ్ విభజన హామీ చట్టం లో స్పష్టముగా రాయలసీమ ప్రాజెక్టులు అయిన ముచు మర్రి , పోతిరెడ్డపాడు ,అలగనూరు రిజర్వాయర్లు అన్ని పూర్తి అనుమతితో చేపట్టడం జరిగింది. కానీ ఈ మధ్య కేంద్ర జల వనరుల శాఖ వారు ప్రకటించిన నోటిఫికేషన్ లో  ఈ ప్రాజెక్టులకు ఆరు నెలలలో అనుమతి కేంద్ర జలవానర శాఖ తో పర్మిషన్ తీసుకోక పోతే రాయలసీమలో ఉన్న ప్రాజెక్టు లు మూసి వేసే పరిస్తితి వస్తూంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికి సాగు నీరు మరియు త్రాగు నీరు అందవు. రాయసీమకు త్రాగు నీరు రైల్వే టాంకర్లతో తోలే దుస్తితి వస్తూంది. కావున ఈ సమస్య రాయలసీమ ప్రజలందరిది. పార్టీలకు అతీతంగా ఈ సమస్య పై పోరాడలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు రహీమ్, నంద్యాల పట్టణ కోశాధికారి డీపీ మస్తాన్ వలీ, నంద్యాల మండల ప్రధాన కార్యదర్శి ఆరీఫ్, సభ్యులు సత్యము, సయ్యద్ మౌలాలి, శివరామ రెడ్డి కరీమ్ముల్ల, ఉస్మాన్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Back to top button