mahesh babuNandyal

కుందూ నది వంతెన పై శాశ్వత ప్యాచింగ్ లు నిర్వహించాలి

నంద్యాల (పల్లెవెలుగు) .అక్టోబర్ 03 :గోస్పాడు మండలం రాయపాడు దగ్గర ఉన్న కుందూ నది వంతెన పై శాశ్వత ప్యాచింగ్ లు నిర్వహించాలని సీపీఐ పార్టీ గోస్పాడు మండల కార్యదర్శి ఇ చెన్నయ్య డిమాండ్ చేశారు.గోస్పాడు మండలంలోని రాయపాడు దగ్గర కుందూనది పై ఉన్న వంతెన అధిక వర్షాల వల్ల ఉప్పొంగి బ్రిడ్జిపై స్లాబ్ లేచిపోయి గుంతలు పడి వాహనం దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పార్టీ గోస్పాడు మండలం కార్యదర్శి చెన్నయ్య ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలల క్రితం అప్పుడు రాయపాడు దగ్గర ఉన్న కుందూనది పై పెచ్చులు లేచిపోయి గుంతలు పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఆందోళన నిర్వహిస్తే తూ తూ మంత్రంగా ఇసుక ఎక్కువ వేసి సిమెంట్ తక్కువగా వేసి ప్యాచింగ్ లు చేయడం వల్ల అది మరల ఎదా మామూలుగా గుంతలు ఏర్పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ కింద పడి లేస్తూ కుందునదిలో ఎక్కడ పడిపోతామోనన్న భయంతో ప్రాణాలు అరచేతబట్టుకొని భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి శాశ్వతంగా ఉండేటట్లు వంతెనపై సిమెంటు రోడ్డు వేయవలసిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది అలా లేనియెడల భారత కమ్యూనిస్టు పార్టీ గోస్పాడు మండలం సమితి గా అక్కడి గ్రామాల ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Back to top button