Abdul JavidNandyal

వినియోగదారుని హక్కుల అవగాహనా సదస్సు

నంద్యాల (పల్లెవెలుగు) 03 అక్టోబర్: స్థానిక టెక్కే కాలిని నందు ముబారక్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఆస్రా – వినియోగ దారుని హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యం లో వినియోగ దారుని హక్కుల పై , వినియోగదారుని రక్షణ చట్టం – 2019 పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు జిలాని అధ్యక్షాత జరిగిన ఈ కార్యక్రమం లో  ముఖ్య అతిధులుగా ఆస్రా వ్యవస్థాపక అధ్యక్షులు హబీబ్ సుల్తాన్ అలీ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వినియోగదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మోసాలు ఎక్కువై పోయాయని వాటిని అరికట్టడానికి వినియోగ దారులకు రక్షణ కవచంగా ఆస్రా ఉండబోతుందన్నారు. ఇప్పటికి తెలుగు రాష్ట్రాలలో మూడు వందలకు పైగా వినియోగ దారుల కేసులు ఉచితంగా ఫైల్ చేశామన్నారు. కర్నూలు జిల్లా వినియోగ దారులు తాము నష్టపోయామని తెలిసినప్పుడు ఎటువంటి న్యాయ సలహా కావాలన్న, ఆస్రా మీకు తోడూ ఉంటుంది అని, ఆస్రా సంస్థ సభ్యులు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు అని భరోసా ఇచ్చారు. ఫుడ్ అధికారి షైక్. ఖాసిం వలీ  మాట్లాడుతూ ఆహరం లో కల్తి ఉన్న, మీకు  కల్తి ఉన్నట్టు అనిపించినా FSSAI కి ఫిర్యాదు చేయాలనీ కోరారు. pvm పరమేశ్ కుమార్ మాట్లాడుతూ తూకల్లో కొలతల్లో మోసాలు జరిగిన, MRP ధరలకు మించి అమ్మినా , మాకు ఫిర్యాదు చేసినచొ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు మహబూబ్ జీలాన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వినియోగదారులకు ఎప్పుడు నష్టం జరిగిన, మీ హక్కులకు ఎప్పుడు నష్టం వాటిల్లిన ఆస్రా సభ్యులకు సంప్రదించ వలసిందిగా పిలుపునిచ్చారు. అనంతరం నూతన జిల్లా కమిటి సభ్యులకు శాలువ, మెమెంటో లతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యవర్గ సభ్యులు  పబ్బతి రమేష్ బాబు, మొహమ్మద్ యూసఫ్, యండి. సైఫుల్లా ఖాన్, నంద్యాల జెఎసి సమద్, అబులైస్, జావిద్, తదితరులు పాల్గొన్నారు.

కమిటి సభ్యులకు శాలువ, మెమెంటోలతో సత్కరిస్తున్న దృశ్యాలు

ఆస్రా కర్నూల్ జిల్లా కమిటి 

aasra committee kurnool
Back to top button