Abdul JavidNandyal

జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఐజేయూ పిలుపు మేరకు ధర్నా

నంద్యాల (పల్లెవెలుగు) 2 అక్టోబర్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఐజేయూ పిలుపు మేరకు నంద్యాలలో ఎపియుడబ్లుజే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శ్యామ్ సుందర్ లాల్, రాష్ట్ర నాయకులు చలంబాబు, జనార్ధన్ రెడ్డి,  జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ భాష, నంద్యాల అధ్యక్షులు మధు, ఉపాధ్యక్షుడు జవిద్, మహబూబ్ బాష, మహేష్ యాదవ్, నాగమణి, శ్రీను, సత్యం, రఫీ, నాగేంద్ర నంద్యాల పాత్రికేయులు  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని, అక్రిడేషన్ కార్డులు చిన్న, పెద్ద పత్రికలు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ విస్తృత సేవలందించిన వైద్యలు, మున్సిపల్, రెవెన్యూ, పోలీసులతో పాటు జర్నలిస్ట్ లకు కూడా 50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను పట్టించుకోకుంటే రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సత్తా చూపిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నారని, జర్నలిస్టులకు ఇందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జగనన్న కాలనీలలో జర్నలిస్టులకు కూడా ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, సీపీఐ, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button